VIKHANASA MAHAMUNI JAYANTHI OBSERVED _ భార‌తీయ సంస్కృతికి వైఖాన‌స ఆగ‌మ శాస్త్ర‌మే ప్ర‌మాణం

TIRUMALA, 11 AUGUST 2022: Sri Vikhanasa Mahamuni Jayanthi was observed at Asthana Mandapam in Tirumala on Thursday.

 

Stalwarts spoke about the great contributions of Sage Vikhanasa and said Vaihanasa Agama is the base for Bharatiya Culture.

 

Dr Vishnu Bhattacharyulu, Sri Ramakrishna, Sri Srinivasa Deekshitulu, Vaikhanasa Trust Secretary Sri Prabhakaracharyulu, Alwar Divya Prabandha Project Program Officer Sri Purushottam and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

భార‌తీయ సంస్కృతికి వైఖాన‌స ఆగ‌మ శాస్త్ర‌మే ప్ర‌మాణం

– శ్రీ విఖ‌నస మహర్షి జయంతి స‌భ‌లో పండితుల ఉద్ఘాట‌న‌

తిరుమ‌ల‌, 2022 ఆగస్టు 11: భార‌తీయ సంస్కృతికి వైఖాన‌స ఆగ‌మ శాస్త్ర‌మే ప్ర‌మాణ‌మ‌ని శ్రీ విఖ‌నస మహర్షి జయంతి స‌భ‌లో పండితులు ఉద్ఘాటించారు. తిరుమలలో గురువారం శ్రీ విఖ‌నస మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆస్థాన మండ‌పంలో టీటీడీ అళ్వార్ దివ్య ప్రభంద ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్దాంత వివర్ధని సభ సంయుక్త ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన శ్రీ శ్రీనివాస దీక్షితులు ప్రసంగిస్తూ, ఆగమాలలో అతి ప్రాచీనమైన‌ది వైఖానస ఆగ‌మ‌మని ఇందులో చెప్పబడ్డ విధివిధానాలు మానవ‌ మనగడకు, సోపానానికి ఎంతో ఉప‌యోగ‌మ‌ని వైఖాన‌సంక‌ల్ప సూత్రంలో ఉప‌దేశించార‌ని చెప్పారు. ఈ వైదిక విధానం మ‌రెక్క‌డ చెప్ప‌బ‌డ‌లేద‌ని, ఇది అత్యంత వేదోక్త వైఖానస సిద్దాంత‌మ‌ని వివ‌రించారు.

టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు మాట్లాడుతూ, అనేక వేద మార్గ విధివిధానాల‌తో వైఖానస సిద్ధాంతం, వైఖాన‌సంక‌ల్ప సూత్రం శ్రీ విఖ‌నస మునీంద్రుల‌చే తీర్చిదిద్దబడిందన్నారు. వైఖానస గ్రంధాల అధ్యయనం ప్రతి ఒక్కరు చేసి జ్ఞాన మార్గ‌ల‌ను అనుష్టించి వైదిక మార్గంలో న‌డ‌వ వల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉన్న‌ద‌ని వివరించారు.

వేద విశ్వవిద్యాలయం వైఖానస ప్రొఫెసర్ శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ పంచబేర అర్చన, విశిష్టంగా వైఖానస ఆగమాలలో ఉపదేశించబడింద‌ని తెలిపారు. తిరుమ‌ల దివ్య‌క్షేత్రంతో పాటు అనేక దివ్య క్షేత్రాల‌లో ఈ ఆరాధ‌న అచ‌రిస్తున్నార‌ని తెలిపారు.

వైఖానస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు ప్రసంగిస్తూ, పురాణాల ప్రకారం శ్రీ విఖనస మహర్షి భోదించిన వ్తెఖానస భగవత్ శాస్త్రాన్ని అయన శిష్యుల్తెన భృగు, అత్రి, మరిచి, కశ్యపు మ‌హ‌ర్షులు క‌లిసి గ్రంథాల‌ రూపంలో లోకానికి అందించారు. ఈ ఆగ‌మ విధివిధానాల‌తోనే తిరుమల దివ్య క్షేత్రంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా వేలాది ఆల‌యాల‌ల్లో పూజ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. త‌ద్వారా స‌మాజంలోని ప్ర‌జ‌లు సంస్కార‌వంత‌మైన ఆధ్యాత్మిక మార్గంలో న‌డ‌వ‌డానికి ఎంతో దోహ‌దం అవుతుంద‌ని తెలిపారు. ఇటువంటి ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను దేశ వ్యాప్తంగా టీటీడీ ఉద్య‌మ స్ఫూర్తితో నిర్వ‌హిస్తోంద‌ని వివ‌రించారు.

అనంత‌రం తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం విద్యార్థి శ్రీ నారాయ‌ణ సంతోష్ కుమార్ ప్ర‌సంగించారు.

టీటీడీ అళ్వార్ దివ్య ప్రభంద ప్రాజెక్టు ప్రోగ్రాం అధికారి శ్రీ పురుషోత్తం, వైఖ‌న‌స ఆశ్ర‌మంకు చెందిన శ్రీ వాసుదేవాచార్యులు, శ్రీ ఎన్‌వివిఎన్ దీక్షితులు, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం పండితులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.