DEVOTEES LOST GOLD BANGLE RETURNED _ భ‌క్తురాలు పోగొట్టుకున్న బంగారు గాజు అప్ప‌గింత

Tirumala, 20 Dec. 21: TTD vigilance on Monday returned a gold bangle to a devotee lost by her in the laddu counters near Srivari temple.

As per details, devotee from Bangalore and his wife had lost the gold bangle near the laddu counters after Srivari Darshan. A home guard on duty Naresh had found it and handed it over at the biometric Centre. The TTD vigilance noticed the couple searching for their lost bangle at laddu counter and after enquiry handed over the 25 gm gold bangle worth Rs.1,00,000 to them.

The vigilance officials lauded the home guard for transparency in duty.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

xt content

భ‌క్తురాలు పోగొట్టుకున్న బంగారు గాజు అప్ప‌గింత

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 20: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం ప‌క్క‌న గ‌ల ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద భ‌క్తురాలు పోగొట్టుకున్న ఒక బంగారు గాజును టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది గుర్తించి తిరిగి అప్ప‌గించారు.

బెంగళూరుకు చెందిన శ్రీ‌ వి.వెంక‌టేష్ అనే భ‌క్తుడు త‌న భార్య‌తో క‌లిసి సోమ‌వారం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. ద‌ర్శ‌నానంత‌రం ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద బంగారు గాజును జార‌విడుచుకున్నారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే విధుల్లో ఉన్న హోమ్‌గార్డ్ శ్రీ న‌రేష్ బంగారు గాజును గుర్తించి బ‌యోమెట్రిక్ వ‌ద్ద అప్ప‌గించారు. ఒక గంట తరువాత పోగొట్టుకున్న భక్తులు లడ్డు కౌంటర్ వద్ద బంగారు గాజు కోసం వెతుకుతుండ‌గా భ‌ద్ర‌తా సిబ్బంది గుర్తించారు. సిసిటివి ఫుటేజిని ప‌రిశీలించి తగిన గుర్తులను నిర్ధారించుకున్నాక 25 గ్రాముల బంగారు గాజును(సుమారు రూ.100,000/-) భక్తుల‌కు అప్ప‌గించారు. విధి నిర్వ‌హ‌ణ‌లో నిజాయితీగా వ్య‌వ‌హ‌రించిన‌ హోమ్‌గార్డ్ శ్రీ న‌రేష్‌ను భ‌ద్ర‌త అధికారులు అభినందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.