GOVINDA CHANTS ON SRI KRISHNA JANMASHTAMI REVERBERATES TIRUMALA _ భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌

Tirumala, 12 Aug. 20: Prayers seeking good health for entire humanity on the auspicious day Sri Krishna Janmashtami touching the sky, Sri Krishna Jananam episode was recited as part of Sundarakanda Pathanam at Nada Niranjanam platform at Tirumala on Wednesday morning.

The holy seven hills turned out to be Dwaraka with the Sri Krishna chants as the Parayanam entered the 125th day.

The theme of the parayanams was Sri Krishna Janam as evinced in the third chapter of Dasama skandam of Bhagavatham.

Later on about twenty Sri Krishna bhaktas from ISKON temple of Tirupati chanted Krishna Bhajans.

Additional EO Sri AV Dharma Reddy, Sri KS Subramaniam Avadhani, Principal of Tirumala Dharmagiri Veda Vijnana Peetham, DyEOs Sri Harindranath, Sri Balaji, Special Officer of Higher Vedic Studies Sri Vibhishana Sharma also participated.

SPECIAL ABHISHEKAM TO SRI KRISHNA AT GOGARBHAM GARDENS

TTD Garden Department has organised an Abhishekam to Kaliyamardhana Krishna at Gogarbham Gardens.

Garden Deputy Director Sri Srinivas was present.

ASTHANAM PERFORMED

Sri Gokulastami Asthanam was performed at Bangaru Vakili between 6pm and 8pm.

Samarpana to Sri Krishna Swamy Varu followed by Nivedanam, Prabhanda Sathumorai, Puranam reading and Asthanam were performed to the deity of Sri Krishna Swamy varu on the occasion. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో ద్వార‌క‌ను త‌ల‌పించిన తిరుమ‌ల‌
       
తిరుమల, 2020 ఆగ‌స్టు 12: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ  తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదికపై సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో భాగంగా బుధ‌వారం ఉద‌యం శ్రీకృష్ణ జన్మాష్టమి పారాయ‌ణం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల గోవింద నామ‌స్మ‌ర‌ణ‌తో తిరుమ‌ల గిరులు ద్వార‌క‌ను త‌ల‌పించాయి. తిరుమ‌ల‌లో టిటిడి నిర్వహిస్తున్న పారాయణ‌ కార్య‌క్ర‌మం బుధ‌వారం 125వ రోజుకు చేరుకుంది.  

శ్రీకృష్ణ జన్మాష్టమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని వ్యాస‌మ‌హర్షి ర‌చించిన భాగ‌వ‌తంలోని ద‌శ‌మ‌స్కంధం మూడ‌వ ఆధ్యాయంలోని శ్రీ‌కృష్ణుని జ‌ననం పారాయ‌ణం చేశారు.

ఆనంత‌రం తిరుప‌తి ఇస్కాన్ నుండి వ‌చ్చిన 20 మంది భ‌క్తులు నామ‌సంకీర్త‌న నిర్వ‌హించారు.  

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, శ్రీ బాలాజి, ఎస్వీ వేద ఉన్న‌త వేద అధ్యాయ‌న‌ సంస్థ ప్ర‌త్యేకాధికారి శ్రీ విభీష‌ణ శ‌ర్మ తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని పాల్గొన్నారు.

తిరుమలలో శ్రీకృష్ణ‌స్వామివారికి విశేష అభిషేకం –

తిరుమలలో శుక్ర‌వారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వ‌ర్యంలో  నిర్వహించారు.

గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి  ఉదయం 10.00 గంట‌ల నుండి పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, కుంకుమ‌, చంద‌నం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాస్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ 19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది