SILKS FROM TIRUMALA PRESENTED TO MANTRALAYAM _ మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
Tirumala, 2 Mar. 20: The Additional Executive Officer of TTD Sri AV Dharma Reddy on Monday morning presented Sesha vastram at Mantralayam on the occasion of 425thJayanti of Sri Guru Raghavendra Swamy.
TTD has been presenting Srivari Sesha vastram since 2006 to Sri Raghavendra Swamy mutt as a part of its commitment for promotion of Hindu Sanatana Dharma.
The Additional EO presented the Sesha vastram to the pontiff of Mantralayam Sri Sri Sri Subudendra Thirtha Swamy.
Srivari temple OSD Sri Pala Seshadri and others participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి
తిరుమల, 2020 మార్చి 02: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 425వ జయంతి ఉత్సవాల సందర్భంగా టిటిడి తరఫున అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి సోమవారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.
హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో 1595వ సంవత్సరంలో తమిళనాడులోని కావేరిపట్నంలో శ్రీ తిమ్మన్న భట్ట, శ్రీమతి గోపికాంబ దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.
ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు అదనపు ఈవోను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.