మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె. అబ్దుల్‌కలాంతో ముఖాముఖి 

మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె. అబ్దుల్‌కలాంతో ముఖాముఖి

తిరుపతి, మార్చి-18,2009: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె. అబ్దుల్‌కలాంతో ఈ నెల 19వ తేదిన మధ్యాహ్నం 3.00 గంటలకు యస్వీ యూనివర్సిటి, తారకరామ స్టేడియంలో విధ్యార్థులతో  ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశామని తి.తి.దే కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి నేడొక ప్రకటనలో తెలపారు. ఈ కార్యక్రమంలో యస్వీ యూనివర్సిటి, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటి, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, స్విమ్స్‌ వర్సిటీలకు చెందిన ఉపకులపతులు, జిల్లా కలెక్టరు, లీడ్‌ ఇండియా ప్రతినిధులు, తి.తి.దే కళాశాలలు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, యితర పాఠశాలల విద్యార్థులు యీ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలపారు.

దేశంలో 55 శాతం పైగా వున్న యువతలో దేశభక్తితో కూడిన నాయకత్వాన్ని పెంచి, 2020 నాటికి దేశాన్ని ప్రపంచలో అగ్రగామిగా చేయుటకు కంకణం కట్టుకున్న భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా|| ఏ.పి.జె.ఆబ్దుల్‌కలాం ఆశయాన్ని సాధించడానికి  ”లీడ్‌ ఇండియా 2020” అనే రెండవ జాతీయ ఉధ్యమానికి నిర్విరామంగా కృషి చేస్తున్నదిని శ్రీరమణాచారి తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థల్లోని విద్యార్థులకు కూడా డా|| కలాం గారి ఆశయాలను తెలియజెప్పి, నీతి నిజాయితి కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్ది, దేశ నిర్మాణంలో వారినికూడా భాగస్వాములను చేయాలనే సదుద్ధేశ్యంతో యీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. దేవస్థానం విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 105 మంది ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులతో పాటు దేవస్థానం విద్యాసంస్థలు మరియు పట్టణంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుతున్న దాదాపు 6000 మంది విద్యార్థులకు ”లీడ్‌ ఇండియా” ”మా అభివృద్ధి దేశాభివృద్ధి” శిక్షణ ఇప్పించామని ఆయన తెలిపారు. చిత్తూరుజిల్లాలో పలు మండలాల నుండి వేలమంది విధ్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు.

యీ గొప్ప కార్యక్రమంలో పట్టణంలోని అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మరియు విద్యార్థులు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని తి.తి.దేవస్థానం కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి కోరారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.