మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 279వ జయంతి ఉత్సవాలు

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 279వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, మే-6, 2009: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 279వ జయంతి ఉత్సవాల సందర్భంగా మే 8వ తేదిన తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా ఉదయం 8గంటలకు శ్రీవారు ఉభయనాంచారీ సమేతంగా తిరుమల మాడవీధుల ద్వారా నారాయణగిరి ఉద్యానవనం చేరుకుంటారు. అనంతరం యస్‌.వి.మ్యూజిక్‌ కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే సంగీత గోష్ఠి నిర్వహిస్తారు. అనంతరం విశాఖపట్నంకు చెందిన శారదపీఠం స్వామిజీ శ్రీశ్రీశ్రీ స్వామి స్వరూపానందగారిచే అనుగ్రహ భాషణం ఉంటుంది. తరువాత తరిగొండవెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా పుస్తకాలు, సిడిల ఆవిష్కరణ జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.