మార్చి 12న శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్ప‌యాగం

మార్చి 12న శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్ప‌యాగం  

తిరుపతి, 2010 మార్చి 06: శ్రీనివాస మంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈనెల 12వ తేదిన పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగుతుంది.

ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో శ్రవణ నక్షత్రం నాడు ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితి. విశేషహోమం, స్నపన తిరుమంజనం జరిపిన తరువాత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు వివిధ రకములైన సుగంధ పరిమళ పుష్పాలతో అభిషేకించడం జరుగుతుంది.

ఈ యాగంలో చామంతులు, నూరువరహాలు, సంపంగిపూలు, రోజాలు, మరువము, తులసి, బిల్వము, పన్నీరు ఆకు, మల్లెపూలు, కనకాంబరం, సెంటుజాజులు, తామరపూలు, కలువపూలు, మెల్లలు, గన్నేరి, నంది వర్థనం, మందార పూలు మొదలగు పుష్పాలను వినియోగిస్తారు. కావున భక్తులుపై తెలిపిన పుప్పాలను విరాళాల రూపంలో మార్చి 12వ తేది ఉదయం 11 గంటలలోపు శ్రీనివాస మంగాపురంలోని గార్డెన్‌ సూపరింటెన్‌డెంట్‌కుచేరు విధంగా పంపవలెను.

ఈ పుష్పయాగంలో రు.516/- చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చును.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.