మార్చి 14 నుంచి 22వ తేది వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
మార్చి 14 నుంచి 22వ తేది వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2010 మార్చి 08: తిరుపతి నగరంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చ 14 నుంచి 22వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ 13వ తేది జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీకోదండరామస్వామివారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు.
తేది ఉదయం సాయంత్రం
14-03-2010 ధ్వజారోహణం (ఉ.8.40 గంటలకు) పెద్దశేష వాహనం
(తిరుచ్చి వాహనం)
15-03-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
16-03-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
17-03-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
18-03-2010 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
19-03-2010 హనుమంత వాహనం గజ వాహనం
20-03-2010 సూర్యప్రభ వాహనం చంద్రఫ్రభ వాహనం
21-03-2010 రథోత్సవం అశ్వ వాహనం
22-03-2010 చక్రస్నానం ధ్వజ అవరోహణం
బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకోదండరామస్వామి వారి ఆలయంకు ఎదురుగా వున్న శ్రీ రామచంద్ర పుష్కరిణిలో మార్చి 27వ తేది నుంచి 29వ తేది వరకు 3 రోజులపాటు తెప్పోత్సవాలు జరుగుతాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.