ANNUAL BRAHMOTSAVAMS IN TARIGONDA _ మార్చి 16 నుండి 24వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 13 March 2024: The annual Brahmotsavams in Sri Lakshmi Narasimha Swamy temple at Tarigonda are scheduled between March 16-24 with Ankurarpanam on March 15.
Important days includes Dwajarohanam on March 16, Garuda Seva and Kalyanotsavam on March 21, Dhooli Utsavam and Radhotsavam on March 22, Chakra Snanam on March 24.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మార్చి 16 నుండి 24వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 మార్చి 13: టీటీడీ ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 15వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.
ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మార్చి 21వ తేదీ గురువారం రాత్రి 8 నుండి రాత్రి 10 గంటల మధ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక అంగవస్త్రం, రవికె, లడ్డూ ప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు. మార్చి 25వ తేదీ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
– మార్చి 16న ఉదయం ధ్వజారోహణం(మీనలగ్నం), రాత్రి హంస వాహనం.
– మార్చి 17న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి హనుమంత వాహనం.
– మార్చి 18న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సింహ వాహనం.
– మార్చి 19న ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి పెద్దశేష వాహనం.
– మార్చి 20న ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి గజ వాహనం.
– మార్చి 21న ఉదయం తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం సర్వభూపాల వాహనం, రాత్రి కల్యాణోత్సవం మరియు గరుడ సేవ.
– మార్చి 22న ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం.
– మార్చి 23న ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, రాత్రి పార్వేట ఉత్సవం మరియు అశ్వవాహనం.
– మార్చి 24న ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.