మార్చి 21 నుండి 27వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గోవింద కల్యాణాలు

మార్చి 21 నుండి 27వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గోవింద కల్యాణాలు

తిరుపతి, మార్చి 17, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 21 నుండి 27వ తేదీ వరకు ఏజెన్సీ ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గోవింద కల్యాణాలు నిర్వహించనున్నారు. మొత్తం ఆరు చోట్ల స్వామివారి కల్యాణాలు జరుగనున్నాయి.
ఇందులో భాగంగా మార్చి 21వ తేదీ సాయంత్రం సాలూరులోని ఎన్‌జిఓ హోమ్‌ మైదానంలో, మార్చి 22న సాయంత్రం సాలూరులోని ఆర్యవైశ్య ధర్మశాల ఆడిటోరియంలో, మార్చి 23న ఉదయం తోనంలోని ఎస్‌సి మరియు ఎస్‌టి హాస్టల్‌ మైదానంలో, మార్చి 24న సాయంత్రం పాచిపెంటలోని కమ్యూనిటీ హాల్‌ మైదానంలో గోవింద కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయి. అదేవిధంగా మార్చి 25వ తేదీన ఉదయం శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం దావలపేట గ్రామంలో, మార్చి 27వ తేదీన సాయంత్రం ఒడిశా రాష్ట్రంలోని జయపురంలో స్వామివారి కల్యాణాన్ని కనులవిందుగా నిర్వహించనున్నారు. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణ ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.