మార్చి 21 నుండి 29వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

మార్చి 21 నుండి 29వ తేదీ వ‌ర‌కు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2010 మార్చి 17: వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేది నుండి 29వ తేది వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అంకురార్పణ 20వ తేదిన నిర్వహిస్తారు.

ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీపట్టాభిరామస్వామి ప్రతిరోజు ఈక్రింది వాహనాలలో ఊరేగుతూ భక్తులను  కనువిందు చేస్తారు.

తేది ఉదయం       సాయంత్రం
21-03-2010 ధ్వజారోహణం (ఉ. 7.20 గంటలకు) గజ వాహనం
22-03-2010 తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం
23-03-2010 తిరుచ్చి ఉత్సవం సింహ వాహనం
24-03-2010 తిరుచ్చి ఉత్సవం శేష వాహనం
25-03-2010 తిరుచ్చి ఉత్సవం మోహిని అవతారం
26-03-2010 తిరుచ్చి ఉత్సవం సీతారామ కల్యాణం
       (గరుడ వాహనం)
27-03-2010 రథోత్సవం (ఉ. 8.15 గంటలకు) డోలి ఉత్సవం
28-03-2010 తిరుచ్చి ఉత్సవం అశ్వ వాహనం
29-03-2010 చక్రస్నానం (ఉ.9.00 నుండి 10.30 గంటల వరకు) హంస వాహనం
     (ధ్వజ అవరోహణం)

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.