ANNUAL DAY OF TIRUMALA SV HIGH SCHOOL ON MARCH 24 _ మార్చి 24న ఎస్వీ ఉన్నత పాఠశాల 51వ వార్షికోత్సవం

TIRUMALA, 23 MARCH 2023: The 51st Annual Day of TTD’s Sri Venkateswara High School will be held on 24th March at Tirumala at 3:30pm onwards.

Director of IIT Madras, Prof V. Kamakoti will be the Chief Guest. Sri.Sanjiv Sarin, Vice President of Raymonds, Dr. Revathi Srinivasan, Director of Singhania Educational Institutions will be the special guests. 

Arrangements are being made by the school principal Mr. K. Krishnamurthy.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 24న ఎస్వీ ఉన్నత పాఠశాల 51వ వార్షికోత్సవం
 
తిరుమల, 23 మార్చి 2023: తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల 51వ వార్షికోత్సవం మార్చి 24వ తేదీ శుక్రవారం జరగనుంది. పాఠశాల ప్రాంగణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
 
మద్రాస్ ఐఐటి డైరెక్టర్ ఆచార్య వి.కామకోటి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ప్రత్యేక అతిథులుగా రేమాండ్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ శరిన్, సింఘానియా విద్యాసంస్థల డైరెక్టర్ డా.రేవతి శ్రీనివాసన్ విచ్చేస్తారు.  ఈ సందర్భంగా వసుధైవ కుటుంబం పేరిట నృత్యరూపకాన్ని  ప్రదర్శిస్తారు. టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.