మార్చి 24 నుండి 28 వరకు నాగలాపురంలో వున్న శ్రీవేదనారాయణస్వామివారి ఆలయంలో సూర్యపూజ మహోత్సవం
మార్చి 24 నుండి 28 వరకు నాగలాపురంలో వున్న శ్రీవేదనారాయణస్వామివారి ఆలయంలో సూర్యపూజ మహోత్సవం
తిరుపతి, మార్చి-12, 2011: నాగలాపురంలో వున్న శ్రీవేదనారాయణస్వామి వారి ఆలయంలో మార్చి 24 నుండి 28 వరకు సూర్యపూజ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మార్చి 26 నుండి 28 వరకు తెప్పోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మార్చి 24 నుండి 28 వరకు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు సూర్యపూజ దర్శనం, 6.30 నుండి 8.00 గంటలకవరకు తిరువీధి ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేవిధంగా మార్చి 28 సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు ఆలయానికి ఎదురుగా గల పుష్కరిణినందు తెప్పోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల సందర్భంగా తితిదే ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే ప్రత్యేక సంగీత, సాంస్కుృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.