ANNUAL BTU OF ANANTAVARAM SVT FROM MARCH 25-28 _ మార్చి 25 నుంచి 28వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 24 March 2021: TTD is organising the annual Brahmotsavam of Sri Venkateshwara temple of Anantavaram, Tallur (M), Guntur District from March 25-28 in adherence to Covid guidelines and Ankurarpanam on March 25 evening.
Following are events of Brahmotsavam beginning with dwajarohanam in Mesha lagnam on March 26 morning and Aswa Vahana at night.
TTD is organising Shanti Kalyan Mahotsavam on March 27, Vasantothsavam, Chakrasnanam and Garuda vahana and Dwajavarohanam on March 28 and finally Pushpa yagam on March 29.
As part of the Brahmotsavam TTD will perform Snapana thirumanjanam daily for utsava idols and Unjal seva in evening.
The artists of TTD’s HDPP and Annamacharya project will present cultural programs and dharmic pravachanas daily.
PHALGUNA SATURDAY UTSAVAS:
TTD is conducting Phalguna Saturday Utsavas in the Anantavaran temple from March 20, 27 and April 3& 10.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 25 నుంచి 28వ తేదీ వరకు అనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2021 మార్చి 24: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 25 నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
మార్చి 26వ తేదీ ఉదయం 7.20 నుండి 8.00 గంటల వరకు మేష లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. మార్చి 27న రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహంచనున్నారు. మార్చి 28వ తేదీ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు గరుడ వాహనం, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరుగనున్నాయి.
అదేవిధంగా మార్చి 29న సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం కన్నులపండుగగా జరుగనుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజలసేవ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు :
ఆలయంలో మార్చి 20వ తేదీ నుంచి ఫాల్గుణ మాస శనివార ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 27, ఏప్రిల్,3, ఏప్రిల్ 10వ తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది