ANNUAL BRAHMOTSAVAM OF SRI KT IN EKANTHAM FROM MARCH 4 TO 13 _ మార్చి 4 నుండి 13వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 23 February 2021: In view of COVID-19 guidelines, TTD is organising the annual Brahmotsavam of Sri Kapileswara temple from March 4 to 13 in Ekantham with Ankurarpanam on March 3.
Following are the schedule of Vahana Sevas of the Brahmotsavam both morning and evening.
04-03-2021(Thursday) Dwajarohanam (Meena lagnam) – Hamsa vahana
05-03-2021(Friday) Surya Prabha vahana and Chandra Prabha vahana
06-03-2021(Saturday) Bhuta vahana and Simha vahana
07-03-2021 (Sunday) Makara vahana and Sesha Vahana
08-03-2021(Monday) Tiruchi utsavam and Adhikanandi Vahana
09-03-2021 (Tuesday) Vyaghra vahana and Gaja Vahana
10-03-2021(Wednesday) Kalpavruksha vahana and Aswa Vahana
11-03-2021(Thursday) Rathotsavam (bhogi theru) and Nandi Vahana
12-03-2021(Friday) Purushamruga Vahana, Kalyanotsavam and Tiruchi utsava
13-03-2021(Saturday Sri Natarajaswami Ravanasura Vahana and Surya Prabha vahana, Trishula snanam and Dwajavarohanam.
All Vahana sevas in the morning and evening for Swami and Ammavaru will be held in Ekantham inside the temple in view of Covid guidelines.
As part of the practice the TTD is organising Koil Alwar Tirumanjanam at the Sri Kapileswara temple on February 28 from 11.30 am to 2.30 pm and devotees darshan will commence after 3.00 pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మార్చి 4 నుండి 13వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2021 ఫిబ్రవరి 23: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ -19 నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
04-03-2021(గురువారం) ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
05-03-2021(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
06-03-2021(శనివారం) భూత వాహనం సింహ వాహనం
07-03-2021(ఆదివారం) మకర వాహనం శేష వాహనం
08-03-2021(సోమవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
09-03-2021(మంగళవారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
10-03-2021(బుధవారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
11-03-2021(గురువారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
12-03-2021(శుక్రవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
13-03-2021(శనివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం :
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 28వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.