మార్చి 6న టిటిడి మహిళా ఉద్యోగుల రక్తదాన శిబిరం 

మార్చి 6న టిటిడి మహిళా ఉద్యోగుల రక్తదాన శిబిరం

తిరుపతి, 01 మార్చి 2023: టిటిడి మహిళా ఉద్యోగులతో మార్చి 6న రక్తదాన శిబిరం జరగనుంది.

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతిలోని టిటిడి సెంట్రల్ హాస్పిటల్ లో ఉదయం 10 గంటలకు ఈ శిబిరం ప్రారంభమవుతుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.