మార్చి 6న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్య సదస్సు
మార్చి 6న శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్య సదస్సు
తిరుపతి, మార్చి 5, 2013: శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 125వ జయంతి సందర్భంగా తితిదే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 6వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు నిర్వహించనున్నారు.
ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానున్న ఈ సదస్సులో మూడు సాహితీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రముఖ పండితులు విచ్చేసి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి సాహిత్యంపై ఉపన్యసించనున్నారు. సాయంత్రం 5.00 గంటలకు సదస్సు సమాపనోత్సవం జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.