ANNUAL BTUs OF SV TEMPLE AT PITHAPURAM FROM MARCH 6-10 _ మార్చి 6 నుండి 10వ తేదీ వ‌ర‌కు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 4 March 2020: TTD is organising the annual Brahmotsavams of Sri Padmavati sameta Venkateswara Swamy temple in Pithapuram of East Godavari district from March 6-10 with Ankurarpanam on March 5.

Major highlights of the Brahmotsavams includes, Dhwajarohanam on March 6, Garuda vahanam on March 7, unjal seva on March 8 and 9, chakra snanam Dwajavarohanam and Pushpa Yagam on March 10.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI     

మార్చి 6 నుండి 10వ తేదీ వ‌ర‌కు పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2020 మార్చి 04: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 6 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 5న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మార్చి 6న ఉద‌యం 9 గంట‌ల‌కు ధ్వజారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. మార్చి 7న రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది. మార్చి 8, 9వ తేదీల్లో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 10న ఉద‌యం 11 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.