మార్చి 8న తితిదే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

మార్చి 8న తితిదే ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మార్చి 8వ తేదీ శుక్రవారం మహిళా దినోత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ వెంగమ్మ, ప్రత్యేక అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ రత్నకుమారి, గౌరవ అతిథిగా సాయిసుధ ఆస్పత్రి అధినేత్రి డాక్టర్‌ సుధారాణి, అతిథులుగా సైకాలజిస్ట్‌ శ్రీమతి స్రవంతి, న్యాయవాది శ్రీమతి జి.జ్యోత్స్న హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 11.00 గంటల నుండి ప్రారంభ ఉపన్యాసం, 11.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు అతిథుల ఉపన్యాసాలు ఉంటాయి. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తితిదేలో త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్న 73 మంది మహిళా ఉద్యోగులను సాయంత్రం 4.00 గంటల నుండి సన్మానించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.