RETIRED EMPLOYEES ASSOCIATION THANK TTD CHAIRMAN – EO – JEO TRIO FOR MAKING THEIR DECADES OLD DREAM TURN REALITY _ మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం-ముఖ్యమంత్రివర్యులతో పాటు టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలకు కృతజ్ఞతలు
Tirupati, 12 March 2024: The office bearers of the Retired Employees Welfare Association expressed their immense gratitude to TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam for making their decades-old dream come true.
Besides the Association President Sri Prabhakar Reddy, other office bearers including Sri Tota Venkateswarulu, Sri GLN Shastry, Sri Das, Retired CE Sri Ramachandra Reddy, Retired Lecturer Sri Bhumana Subramanyam Reddy, Retired DyEO Sri Chenga Reddy also spoke on the occasion.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం
• ఇంటి స్థలం మాకు భరోసానిచ్చింది
• ముఖ్యమంత్రివర్యులతో పాటు టీటీడీ ఛైర్మన్, ఈవో, జేఈవోలకు కృతజ్ఞతలు
• ఉద్వేగభరితంగా ప్రసంగించిన విశ్రాంత ఉద్యోగులు
తిరుపతి, 2024, మార్చి 12: ఇంటి స్థలం తమ జీవితానికి భరోసానిచ్చిందని, 30 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఆనంద క్షణాలు ప్రస్తుతం ఆవిష్కృతమయ్యాయని, ధర్మకర్తల మండలి ఛైర్మన్ తో పాటు అధికారులను జీవితాంతం గుర్తుంచుకుంటామని టీటీడీ విశ్రాంత ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.
విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ ఇంటి స్థలాలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఇందుకు కృషిచేసిన టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డికి, ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డికి, జేఈవో శ్రీ వీరబ్రహ్మంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికుడైన టీటీడీ ఛైర్మన్ కు ఉద్యోగుల సాధకబాధకాలు తెలుసని, మంచి మనసుతో ఆయన సాయం చేశారని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు, పెన్షనర్లకు స్థలాలు ఇవ్వడాన్ని ఇంటి స్థలాల బ్రహ్మోత్సవంగా అభివర్ణించారు. ఇది ఒక చరిత్ర అని, భవిష్యత్తులో మరెవ్వరికీ ఇది సాధ్యం కాదని తెలియజేశారు.
ప్రసంగించిన వారిలో విశ్రాంత ఉద్యోగులు శ్రీ చెంగారెడ్డి, శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ భూమన్, శ్రీ ఆర్.ప్రభాకర్ రెడ్డి, శ్రీ టి.వెంకటేశ్వర్లు, శ్రీ దాసు, శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి, విశ్రాంత ఉద్యోగి శ్రీ మునిరత్నంరెడ్డి కుమారుడు డాక్టర్ నవీన్ తదితరులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.