VEDASEERVACAHANAM ON BEHALF OF TTD TO CHIEF MINISTER _ ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌కు టీటీడీ త‌ర‌ఫున వేదాశీర్వ‌చ‌నం

ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌కు టీటీడీ త‌ర‌ఫున వేదాశీర్వ‌చ‌నం

తిరుమల, 01 జనవరి 2024: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గన్మోహన్ రెడ్డికి టీటీడీ వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు.

సోమ‌వారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రివ‌ర్యుల నివాసంలో టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం నూత‌న సంవ‌త్స‌ర‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ వేద‌పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంత‌రం ముఖ్య‌మంత్రివ‌ర్యుల‌ను శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, టీటీడీ డైరీ, క్యాలెండ‌ర్‌ను జెఈవో అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Tirumala, 01 January 2024: On the occasion of New Year 2024, TTD Vedic scholars have rendered Vedaseervachanam to the Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy.

On Monday, on behalf of TTD, JEO Sri Veerabrahamam conveyed New Year Greetings to the Honorable CM of AP at the later residence in Tadepalli. 

On this occasion, TTD Vedic scholars have offered Vedaseervachanam to the head of the State.  After that the Chief Minister were honored with Sesha Vastram and Srivari Theertha Prasadams. The 2024 TTD Diary and Calendar were presented by the JEO.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI