ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు
ముగిసిన శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాలు
తిరుపతి, 2020 జూలై 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు శనివారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులోభాగంగా మధ్యాహ్నం శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీ సుందరరాజస్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.