MUTYAPU PANDIRI VAHANAM _ ముత్య‌పుపందిరి వాహనంపై గోవిందుడి కటాక్షం

TIRUPATI, 18 MAY 2024: On the second day evening, Sri Govindaraja flanked by Sridevi and Bhudevi on His either sides took out a celestial ride on a Pearl Canopy.

Both the seers of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others, devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై గోవిందుడి కటాక్షం

తిరుపతి, 2024 మే 18: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవిందరాజస్వామివారు ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ నారాయణ, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.