BAKASURAVADHA EPISODE RECREATED _ ముత్య‌పుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

TIRUPATI, 02 MARCH 2024: As a part of the ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram, on the third day evening, Sri Kalyana Venkateswara in the guise of Bakasuravadha, blessed His devotees on Mutyapu Pandiri Vahanam on Saturday.

The dance troupes added the glamour to the carrier fete along with the finely decked temple bulls, horses and elephants which led the show.

Temple Spl Gr DyEO Smt Varalakshmi, SVETA Director Sri Bhuman Subramanyam Reddy and others were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ముత్య‌పుపందిరి వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2024 మార్చి 02: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం రాత్రి అనంత తేజోమూర్తి అయిన శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీనివాసుడు బకాసుర వధ అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

రాత్రి 7 గంటలకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహ‌న‌సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు,టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.