KODANDARAMA ON MUTYAPU PANDIRI _ ముత్యపుపందిరి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కటాక్షం
Tirupati, 21 Jun. 21: Sri Kodanda Rama Swamy has blessed His devotees on Mutyapu Pandiri Vahana on the third day evening on Monday at Appalayagunta.
Superintendent Sri Gopalakrishna Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ కోదండరామస్వామివారి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కటాక్షం
తిరుపతి, 2021 జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు శ్రీ కోదండరామస్వామివారి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై కటాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహించారు.
ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి తన శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణ చక్రం నుండి మోక్షాన్ని పొందుతారని స్వామివారు ఈ వాహనం ద్వారా భక్తులకు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మరియు కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణరెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.