ONE MONTH ACTION PLAN FOR PLASTIC FREE TIRUMALA- ADDL EO SRI DHARMA REDDY _ మూడు ద‌శ‌ల్లో ప్లాస్టిక్ ర‌హిత తిరుమ‌ల‌ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

GMR GROUP TO DEVELOP REST HOUSE LANDSCAPE AND GARDENS IN TIRUMALA

Tirumala, 12 Nov. 19: TTD has set rolling the TTD board decision of Plastic free Tirumala in three stages, said Additional EO Sri A V Dharma Reddy.

Addressing reporters after a meeting with all HODs at Annamaiah Bhavan in Tirumala on Tuesday, the Additional EO said in the first phase within a week water bottle use will be banned in all TTD departments at Tirumala. The HoDs of the TTD have to generate a certificate to the effect that no plastic bottle is utilized in their office and only TTD Jalaprasadam water is to be utilized.

In the second stage, at all TTD rest houses, within 15 days there would be a mandatory advisory for devotees as they come to reception centers where they get room keys. 

In the third stage a meeting of all eateries and restaurants at Tirumala will be held to urge them not to use water bottles anymore and use only water from Jalaprasadams within fifteen days. 

If all these exercises are completed TTD will issue notices to the agencies that supply water bottle to Tirumala. Further on bringing of water bottles in all transport vehicles like cars and buses will be stopped at the Alipiri and water bottles will not be allowed at that point itself. 

Adding further he said, it is found that laddu free tokens in sarva darshan were being misused by unscrupulous elements hence a new procedure has been innovated and implemented. Laddu token with bar coded access cards will be issued which undergoes scanning for a two times. If the laddu tokens are not scanned the data will not come on the screen at the laddu counters and no laddu will be issued. It will also put an end to misuse of laddu tokens by middlemen.

On lockers allotment system in PACs, he said, the total process is streamlined.

Kasthubham, Panchajanyam, Nandakam, Vakula rest houses will all have a uniform room tariff at Rs.1000 per day with provision of all amenities and securities. All the rooms have same size and facilities in all the rest houses and a team of officers will be on regular rounds of inspections every day, he added.

He said the Deputy Conservator of Forest Sri Phanikumar Naidu and Garden Superintendent Sri Srinivasulu will inspect and develop all meridians in front of rest houses.

Incidentally the GMR corporate group has come forward to take up the maintenance and up keep of the gardens in Tirumala and also the gardens in the rest houses etc. They will complete the first phase by November end, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

మూడు ద‌శ‌ల్లో ప్లాస్టిక్ ర‌హిత తిరుమ‌ల‌ : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

న‌వంబ‌రు 12, తిరుమల, 2019: టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు తిరుమ‌ల‌ను మూడు ద‌శ‌ల్లో ప్లాస్టిక్ ర‌హితంగా మారుస్తామ‌ని, ఇందుకోసం ప‌టిష్ట‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

స‌మావేశం అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని అన్ని టిటిడి కార్యాల‌యాల్లో వారంలోపు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ను పూర్తిగా నిషేధించి జ‌ల‌ప్ర‌సాదం నీటిని స్వీక‌రించాల‌ని సూచించామ‌ని, ఈ మేర‌కు ఆయా విభాగాల అధికారులు ధ్రువీక‌ర‌ణ పంపుతార‌ని తెలిపారు. అన్ని విశ్రాంతి గృహాల‌కు 15 రోజుల్లో జ‌ల‌ప్ర‌సాదం నీటిని స‌ర‌ఫ‌రా చేసి ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధంపై భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. గ‌దుల్లో భ‌క్తులు నీటిని తాగేందుకు వీలుగా జ‌గ్గులు, కాగితం గ్లాసులు అందుబాటులో ఉంచుతామ‌ని చెప్పారు. టిటిడి ఆరోగ్య‌శాఖాధికారి ఆధ్వ‌ర్యంలో 15 రోజుల్లో అన్ని హోట‌ళ్లు, అల్పాహార‌శాల‌ల య‌జ‌మానుల‌తో స‌మావేశం నిర్వ‌హించి ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల వాడ‌కాన్నిపూర్తిగా నిలిపివేయాల‌ని కోర‌తామ‌న్నారు. ఒక నెల త‌రువాత తిరుమ‌ల‌కు ప్లాస్టిక్ వాట‌ర్ బాటిళ్ల‌ స‌ర‌ఫ‌రాకు సంబంధించి లైసెన్సును ర‌ద్దు చేస్తామ‌ని, అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హించే స‌మ‌యంలో ప్లాస్టిక్ బాటిళ్లు తిరుమ‌ల‌కు తీసుకెళ్ల‌కూడ‌ద‌ని భ‌క్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని వివ‌రించారు.

తిరుమ‌ల‌లో 15 రోజుల క్రితం 23 మంది ల‌డ్డూ ద‌ళారుల‌ను భ‌ద్ర‌తా సిబ్బంది గుర్తించార‌ని అద‌న‌పు ఈవో తెలిపారు. ఈ క్ర‌మంలో ల‌డ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అరిక‌ట్టేందుకు రెండంచెల స్కానింగ్ విధానాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం, దివ్య‌ద‌ర్శ‌నం కాంప్లెక్సుల్లో మొద‌ట ల‌డ్డూ టోకెన్ల‌ను స్కాన్ చేసి భ‌క్తుల‌కు అందిస్తార‌ని, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని స్కానింగ్ పాయింట్ వ‌ద్ద మ‌రోసారి స్కాన్ చేసేలా నూత‌న విధానాన్ని రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. రెండోసారి స్కాన్ చేసిన స‌మాచారం మాత్ర‌మే లడ్డూ కౌంట‌ర్ల‌కు చేరుతుంద‌న్నారు. పిఏసిల్లో లాక‌ర్లు కేటాయించే స‌మ‌యంలో తాళం చెవిని భ‌క్తుల‌కు అందిస్తామ‌ని, ఖాళీ చేసేట‌పుడు తాళం, తాళం చెవిని భ‌క్తులు అందించాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

వ‌కుళాభ‌వ‌నం త‌ర‌హాలోనే కౌస్తుభం, నంద‌కం, పాంచ‌జ‌న్యంలోని గ‌దుల అద్దెను రూ.1000/-గా బోర్డు నిర్ణ‌యించింద‌న్నారు. ఇక్క‌డ భ‌క్తుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా ఎస్ఇ-2, ఇఇ(ఎఫ్ఎంఎస్‌), ఆర్‌-2 డెప్యూటీ ఈవో  ప్ర‌తినిత్యం త‌నిఖీలు చేప‌ట్టాల‌ని ఆదేశించామ‌న్నారు. అన్ని విశ్రాంతి గృహాల వ‌ద్ద ప‌చ్చ‌ద‌నం పెంచుతున్న‌ట్టు తెలిపారు. జిఎంఆర్ సంస్థ విరాళంగా తిరుమ‌ల‌లో ఉద్యాన‌వ‌నాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింద‌ని, న‌వంబ‌రు నెలాఖ‌రులో మొద‌టి ద‌శ ప‌నులు చేప‌డ‌తార‌ని, గార్డెన్ సూప‌రింటెండెంట్‌, డిఎఫ్‌వో ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని తెలిపారు.  

ఈ స‌మావేశంలో టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ దామోద‌ర్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శ్రీ శేషారెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.