HOUSE SITES TO TTD EMPLOYEES IN THREE MONTHS _ మూడు నెలల్లో సిఎం ద్వారా ఇంటి స్థలాలు పంపిణీ – టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం రూ 61 కోట్ల 63 లక్షల చెక్కు జిల్లా కలెక్టర్ కు అందించిన టీటీడీ ఛైర్మన్, ఎమ్మెల్యే

YS JAGANMOHAN REDDY FULFILS 30 YEAR DREAM OF TTD EMPLOYEES- CHAIRMAN AND TIRUPATI MLA

HANDS OVER 61.63 CRORE TO CHITTOOR DISTRICT COLLECTOR FOR EMPLOYEES HOUSE SITES

Tirupati, 31 March 2022: TTD Chairman Sri YV Subba Reddy on Thursday said the credit for fulfilling 30 year long pending aspirations of TTD employees for owning house sites in Tirupati goes to the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy.

Accompanied by the local MLA Sri Bhumana Karunakar Reddy he handed over a cheque for ₹61.63 crore towards land cost to Chittoor District Collector Sri Hari Narayan on Thursday evening at Sri Padmavati rest house.

Speaking on the occasion the TTD Chairman said that upon the request of local MLA Sri B Karunakar Reddy and state minister Sri P Ramachandra

Reddy besides his personal request the AP CM had responded favourably and directed officials to identify land for house sites free of cost and expedite the matter.

The officials identified the land of 300.22 acres in survey no 42 of Padiredu forest village suitable for house sites for 5518 TTD employees but anticipating objections the TTD board was advised to pass a resolution to that effect.

The TTD chairman said the house sites were decided way back in 2008 October and in 2010 July dips were conducted on seniority basis for allotment of house sites and apartments.

However the issue was raised in Supreme Court and to ensure against legal hurdles the TTD board advised employees to set up a model house building society, he said.

He said since it was difficult for employees to pay up such a huge amount the TTD board has made the goodwill payment for sake of employees and the employees were expected to reimburse the amount to TTD as per rules and regulations.

He said on behalf of the employees the TTD would take possession of the land and commence the development works and soon the house sites would be allocated to the employees.

Sri B Karunakar Reddy, Tirupati MLA said in view of legal hurdles and even though the AP CM desired to allot cost-free housing sites to TTD employees a nominal amount shall be collected on allotment.

He urged the TTD employees not to cut across issues and ensure to get housing plots at the earliest and commence house-building activities.

The TTD employees conveyed their heartfelt gratitude and thanks to TTD Chairman Sri YV Subba Reddy, minister Sri P Ramachandra Reddy, MLA Sri B Karunakar Reddy, TTD board member Sri P Ashok Kumar, TTD EO Dr KS Jawahar Reddy, TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam for achieving their 3 decade long aspirations to own houses in Tirupati.

FA& CAO Sri O Balaji, Law officer Sri Reddappa Reddy, DyEOs Sri Govindarajan, Sri Damodaram, Estate OSD Sri Mallikarjun were also present

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మూడు నెలల్లో సిఎం ద్వారా ఇంటి స్థలాలు పంపిణీ

– టీటీడీ ఉద్యోగుల 30 ఏళ్ళ కల సాకారం చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది

– టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం రూ 61 కోట్ల 63 లక్షల చెక్కు జిల్లా కలెక్టర్ కు అందించిన టీటీడీ ఛైర్మన్, ఎమ్మెల్యే

తిరుపతి 31 మార్చి 2022: టీటీడీ ఉద్యోగుల 30 సంవత్సరాల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం వడమాల పేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలో సేకరించిన 300.22 ఎకరాల భూమి కోసం టీటీడీ సిద్ధం చేసిన రూ 61. 63 కోట్ల చెక్కును ఎమ్మెల్యే శ్రీ భూమన కారుణాకర రెడ్డి తో కలసి గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణన్ కు అందజేశారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు.

టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారని చెప్పారు. తనతో పాటు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడినప్పుడి ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా స్పందించి ఉద్యోగులకు వెంటనే ఇంటి స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఉద్యోగులకు ఉచితంగా ఇంటిస్థలాలు ఇవ్వాలని సిఎం చెప్పారని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉచితంగా ఇస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు వివరించారన్నారు. ఇందుకు సంబంధించి బోర్డులో తీర్మానం చేయాలని సిఎం ఆదేశించారన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి చొరవతో 5, 518 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి నేడు మార్గం సుగమం అయ్యిందని చైర్మన్ తెలిపారు.

వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలోని సర్వేనెంబర్ 42 లో 300.22 ఎకరాల భూమిని టిటిడి ఉద్యోగులకు ఇంటి స్థలాలుగా ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అప్పటి టిటిడి బోర్డు ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. దీనికి అవసరమైన భూమిని గుర్తించి అభివృద్ధి చేసి 2008 అక్టోబర్, 2010 జూలైలో డిప్ నిర్వహించి సీనియార్టీ ప్రకారం ఉద్యోగులకు ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

దురదృష్టవశాత్తు దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరిందన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ధర్మకర్తల మండలి హౌస్ బిల్డింగ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని ఉద్యోగులకు సూచించిందని ఆయన వివరించారు.

ఈ మేరకు పాదిరేడు అరణ్యం గ్రామంలో 300. 22 ఎకరాల భూమి టీటీడీ స్వాధీనం చేసుకోవడం కోసం రూ. 61. 63 కోట్లు జిల్లా కలెక్టర్ కు చెల్లించినట్లు శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు.

ఉద్యోగులే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉన్నా, వారు ఒక్కసారిగా ఇంత మొత్తం సమకూర్చుకోవడం కష్టమనే అభిప్రాయంతో, మొదట టీటీడీ యాజమాన్యమే ఈ మొత్తం చెల్లించిందని, తర్వాత ఉద్యోగులు టీటీడీ నియమ నిబంధనలు అనుసరించి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారన్నారు.

భూమి స్వాధీనం చేసుకుని వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే ఉద్యోగులకు స్థలాలు చేయడం జరుగుతుందన్నారు.

శాసనసభ్యులు శ్రీ భూమన కారుణాకర రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలనే ముఖ్యమంత్రి దృఢ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఉద్యోగుల కు ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారనీ, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే ఉద్యోగులు తక్కువ మొత్తం చెల్లించేలా ఇంటి స్థలాలు మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగుల కోసం ఇంతకంటే ఆలోచించే ప్రభుత్వం రానే రాదన్నారు. ఉద్యోగులు అభిప్రాయ భేదాలను పక్కకు పెట్టి ఇంటి స్థలాలను నిలుపుకోవాల్సిన బాధ్యత వారిమీదే ఉందన్నారు.

30 సంవత్సరాల కల నిజం చేసిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి, పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవికి ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

పాలక మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, జె ఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర బ్రహ్మం, ఎఫ్ ఎ సీఎఓ శ్రీ బాలాజి, లా ఆఫీసర్ శ్రీ రెడ్డెప్ప రెడ్డి, డిప్యూటి ఈవో లు శ్రీ దామోదరం, శ్రీ గోవిందరాజన్, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లిఖార్జున పాల్గొన్నారు

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది