BLESSED TO PARTICIPATE IN METLOTSAVAM – HDPP SECRETARY DR SRINIVASULU _ మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం 

  • TIRUMALA FOOTPATH REVERBERATES WITH GOVINDA NAMA CHANTING

Tirupati, 12 July 2023: The secretary of the Hindu Dharma Prachara Parishad wing of TTD Dr Srinivasulu said eminent devotees of Sri Venkateswara Swamy had trekked on Tirumala footpath routes and attained salvation.

Earlier along with Sri Ananda Theerthacharyulu, the Special Officer of the Dasa Sahitya Project, he inaugurated the Srivari Trimasika Metlotsavam festivities at the Alipiri Padala Mandapam in the early hours of Wednesday.

Speaking on the occasion he said ardent devotees like Sri Purandaradasa, Sri Vyasaraja, Sri Annamacharya and even Vijayanagara emperor Sri Krishna Devnaraya had come to Tirumala on foot for Srivari Darshan and spread the Bhakti concept across the globe. TTD conducts the annual Metlotsavam as a tribute to all such personalities, he added.

About 3500 Bhajana teams from Maharastra, Tamilnadu, Telangana, Karnataka and Andhra Pradesh participated in this fete. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం

– హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు

– భజనమండళ్ల గోవిందనామస్మరణతో మార్మోగిన నడకమార్గం

 తిరుపతి, 2023, జూలై 12: పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారి కృపకుపాత్రులయ్యారని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ శ్రీనివాసులు చెప్పారు.

ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం బుధవారం తెల్లవారుజామున అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్రీ శ్రీనివాసులు కలిసి మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

శ్రీఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టీటీడీ మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
           
అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.