మే నెలకు వ‌ర‌కు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల తేదీల మార్పు, ర‌ద్ధుకు అవ‌కాశం

మే నెలకు వ‌ర‌కు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల తేదీల మార్పు, ర‌ద్ధుకు అవ‌కాశం

తిరుమ‌ల‌, 2020 మార్చి 12: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 2020 మే నెల 31వ తేదీ వ‌ర‌కు ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందిన భక్తులు గురువారం నుండి త‌మ ద‌ర్శ‌న తేదీలు మార్చుకునే వెసులుబాటు, ర‌ద్ధు చేసుకునేందుకు టిటిడి అవ‌కాశం క‌ల్పించింది. కరోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా, భ‌క్తుల సౌక‌ర్యార్థం టిటిడి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

తిరుమ‌ల‌లో ప్ర‌తి నిత్యం వేలాది మంది భ‌క్తులు ఉంటారు కావున జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రంతో ఉన్న‌వారు ద‌య‌చేసి త‌గ్గిన త‌ర్వాత మాత్ర‌మే తిరుమ‌ల‌కు రావాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.