BHAGAVAT RAMANUJACHARYA AVATARA MAHOTSAVAMS _ మే 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు
మే 10 నుంచి 12వ తేదీ వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు
తిరుపతి, 2024 మే 08: అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మే 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యులపై సాహితీ సదస్సు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మే 10వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ ” శ్రీ రామానుజ వైభవం” పై ఉపన్యసిస్తారు. తరువాత తిరుపతికి చెందిన శ్రీమతి రేవతి బృందం భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.