BHASHYAKARLA SATTUMORA ON MAY 12 _ మే 12న శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర
మే 12న శ్రీవారి ఆలయంలో భాష్యకారుల సాత్తుమొర
తిరుమల, 2024 మే 11: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 12వ తేదీన ఆదివారం భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. ఈ ఉత్సవం సందర్భంగా మే 3 నుండి 21వ తేదీ వరకు 19 రోజులపాటు ఉభయం సమర్పణ జరుగుతోంది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.
శ్రీ భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపడతారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు పాల్గొంటారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.