KAT IN PAT _ మే 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
మే 14న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2024 మే 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. వసంతోత్సవాల సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9.30 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా మే 14న కల్యాణోత్సవం , సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
TIRUPATI, 11 MAY 2024: In connection with annual Vasanthotsavams, koil alwar Tirumanjanam will be observed in Sri Padmavati Ammavari temple in Tiruchanoor on May 14.
The spring festival will be observed for three days from May 22 to 24.
In view of the temple cleansing ritual, TTD has cancelled Kalyanotsavam, Sahasra Deepalankara Seva on May 14.