BRAHMOTSAVAMS IN NEW DELHI TEMPLE _ మే 21 నుండి 29వ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 04 May 2024: The annual Brahmotsavams will be held from May 21 to 29 at Sri Venkateswara Swamy Temple in New Delhi with Ankurarpanam on May 20.
 
Before the Brahmotsavam, Koil Alwar Tirumanjanam (traditional Temple Cleaning ritual) is performed on May 14. On May 21, between 10.45 am to 11.30 am, the flag hoisting ceremony will be held in Karkataka Lagnam. 
 
During Brahmotsavam, Vahana Sevas will be conducted between 8 am to 9 am and again between 7.30 pm and 8.30 pm. Pushpayagam will be performed on May 30 from 6 pm to 8 pm.
 
Important days includes Dhwajarohanam on May 21, Kalyanotsavam, Garuda Vahanam on May 25, Radhotsavam on May 28, Chakra Snanam on May 29.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21 నుండి 29వ తేదీ వరకు న్యూఢిల్లీ శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 04 మే 2024: న్యూఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. మే 20న‌ సాయంత్రం అంకురార్పణం జ‌రుగ‌నుంది.

బ్రహ్మోత్సవాల ముందు మే 14వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వ‌హిస్తారు. మే 21వ తేదీ ఉదయం 10.45 నుండి 11.30 గంటల మ‌ధ్య క‌ర్కాట‌క‌ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 30వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

21-05-2024 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్ద‌శేష వాహనం.

22-05-2024 ఉదయం – చిన్న‌శేష వాహ‌నం, రాత్రి – హంస వాహనం.

23-05-2024 ఉదయం – సింహ వాహ‌నం, రాత్రి – ముత్య‌పుపందిరి వాహ‌నం.

24-05-2024 ఉదయం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం, రాత్రి – స‌ర్వ‌భూపాల వాహనం.

25-05-2024 ఉదయం – మోహినీ అవ‌తారం, సాయంత్రం – క‌ల్యాణోత్స‌వం, రాత్రి – గ‌రుడ వాహ‌నం.

26-05-2024 ఉదయం – హ‌నుమంత వాహ‌నం, రాత్రి – గజవాహనం.

27-05-2024 ఉదయం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం, రాత్రి – చంద్ర‌ప్ర‌భ వాహ‌నం.

28-05-2024 ఉదయం – ర‌థోత్స‌వం, రాత్రి – అశ్వ వాహ‌నం.

29-05-2024 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.