VENGAMAMBA JAYANTI FETE _ మే 21, 22వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

Tirupati, 20 May 2024: The 294th Birth Anniversary of Matrusri Tarigonda Vengamamba will be observed in a grand manner in Tirupati and Tarigonda on May 21 and 22.

In Annamacharya Kalamandiram in Tirupati, Sahiti Sadas has been organised on both days at 10am followed by devotional sangeet at 6pm.

On May 22, the statue of Vengamamba will be garlanded at MR Palle Circle in Tirupati.

In Tarigonda, Snapanam will be performed to the Utsava deities of Sri Lakshmi Narasimha Swamy in the morning followed by Gosthi Ganam in the evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 21, 22వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2024 మే 20: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలను మే 21, 22వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు.

తిరుప‌తిలో….

మే 21, 22వ తేదీల్లో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితి సదస్సు నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

మే 22వ తేది ఉదయం 8 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు.

తరిగొండలో…

మే 22వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆలయ ప్రాంగణంలో పుష్పాంజలి, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులతో గోష్టి గానం, హరికథ నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.