ANNAMACHARYA 616TH BIRTH ANNIVERSARY FROM MAY 23 TO 29 _ మే 23 నుండి 29వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు

Tirupati, 22 May 2024: The 616th birth anniversary celebrations of Sri Thallapaka Annamacharya, Telugu Padakavita Pitamaha, will be observed from May 23 to 29 at Annamaiah birthplace Dhyanamandiram in Thallapaka, at the 108-feet Annamaiya statue, at Annamacharya Kalamandir in Tirupati.

As part of this, Srivari Kalyanam will be performed on May 23 at Dhyanamandiram in Thallapaka by 10.30 am.

 In Thallapaka..

   

From May 23 to 29, devotional music and dance programs will be conducted at Dhyanamandiram, Thallapaka and also at the 108-foot Annamayya statue.

 In Tirupati..

Sahitya Sadas will be conducted at Tirupati Annamacharya Kalamandiram from May 24 to 29 from 10.30 am to 1.00 pm.  From May 23 to 29, music and dance programs will be organized with famous artistes both in the morning and evening hours.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 23 నుండి 29వ తేదీ వ‌ర‌కు అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు
 
తిరుపతి, 2024 మే 22: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 616వ జయంతి ఉత్సవాలు మే 23 నుండి 29వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుపతిలోని  అన్నమాచార్య కళామందిరంలో జ‌రుగ‌నున్నాయి. 
 
ఇందులో భాగంగా మే 23వ తేదీన తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద ఉద‌యం 10.30 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణం నిర్వ‌హిస్తారు.
 
తాళ్లపాకలో..
   
మే 23 నుండి 25వ తేదీ వరకు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తాళ్ల‌పాక‌లోని ధ్యాన‌మందిరం వ‌ద్ద, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. 
 
తిరుపతిలో..
 
తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మే  24 నుండి 29వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు సాహితీ సదస్సులు నిర్వ‌హిస్తారు. మే 23 నుండి 29వ తేదీ వ‌రకు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో ప్రముఖ కళాకారులతో సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.