మే 25 నుండి 27వ తేది వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు
మే 25 నుండి 27వ తేది వరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2010 మే 19: కడపజిల్లా దేవుని కడపలోని శ్రీలక్ష్ష్మీి వేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవాలు ఈనెల 25వ తేది నుండి 27వ తేది వరకు 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.
ఈ తెప్పోత్సవాలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పలపై విహరిస్తూ భక్తులను కనువిందు చేస్తారు. తెప్పోత్సవాలలో స్వామి అమ్మవార్లు మొదటిరోజు మూడు ప్రదక్షణలు, రెండవ రోజు ఐదు ప్రదక్షణలు, మూడవరోజు ఏడు ప్రదక్షణలు తెప్పలపై ఊరేగుతూ భక్తుల కర్పూరనీరాజనాలను అందుకుంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.