మే 26 నుండి జూన్ 3వ తేదీ వ‌ర‌కు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 26 నుండి జూన్ 3వ తేదీ వ‌ర‌కు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే-21, 2008: కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 26వ తేది నుండి జూన్‌ 3వ తేది వరకు వైభవంగా నిర్వహిస్తారు. మే 25వ తేదిన అంకురార్పణం జరుగుతుంది.

బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రోజులు : మే 26వ తేదిన ఉదయం 9.47 గంటలకు కటక లగ్నమందు ధ్వజారోహణము, మే 30వ తేదిన గరుడవాహనము, జూన్‌ 2వ తేదిన ఆర్జిత కల్యాణోత్సవము, జూన్‌ 3వ తేదిన ఉదయం 9.30 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు.

జూన్‌2వ తేదిన నిర్వహించు ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొన దలచిన గృహస్థులు రూ.300/-లు చెల్లించాలి. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు తి.తి.దే., ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.