మే 3వ తేది నుండి 5వ తేది వరకు వార్షిక పద్మావతి పరిణయోత్సవము

మే 3వ తేది నుండి 5వ తేది వరకు వార్షిక పద్మావతి పరిణయోత్సవము

తిరుమల, ఏఫ్రిల్‌-24, 2009: తిరుమల నారాయణగిరి ఉధ్యానవనంలో మే 3వ తేది నుండి 5వ తేది వరకు వార్షిక పద్మావతి పరిణయోత్సవము వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సేవనందు పాల్గొనదలచిన భక్తులు రూ.5000/-లు చెల్లించి పాల్గొనవచ్చును. ఒక టికెట్టుపై ఐదుగురిని (ఒకరోజు మాత్రం) అనుమతిస్తారు. వీరికి పట్టుసరిగ దుప్పట, రవికె, 10 పెద్దలడ్లు, 10 వడలు బహుమానంగా ఇస్తారు. పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను రద్దు చేశారు.

ఈ సందర్భంగా తితిదే ధర్మప్రచారపరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం 6.00 గంటల నుండి 9.00 గంటల వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటిరోజున గాత్రం, రెండవరోజున హరికథ, మూడవరోజున కర్ణాటక వాద్య సంగీతం ఏర్పాటు చేస్తారు.

ఈ మూడురోజులలో సాయంత్రం 4.30 గంటలకు శ్రీమలయప్పస్వామివారు మొదటిరోజున చిన్నశేషవాహనంపైన, రెండవరోజున అశ్వవాహనంపైన, మూడవరోజున గరుడవాహనంపైన, అదేవిధంగా శ్రీపద్మావతి అమ్మవారు పల్లకీపైన శ్రీవారి ఆలయంనుండి మాడవీధులగుండా నారాయణగిరి ఉధ్యానవనానికి ప్రదర్శనగా వెళతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

tent