మే 4, 5వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు

మే 4, 5వ తేదీలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2023 మే 03: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలను మే 4, 5వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో వైభవంగా నిర్వహించనున్నారు.

మే 4వ తేదీ తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు తొండవాడకు చెందిన శ్రీకృష్ణారెడ్డి తిరుపతికి చెందిన డాక్టర్ యువశ్రీ, డాక్టర్ నాగోలు కృష్ణారెడ్డిలచే సాహితి సదస్సు, సాయంత్రం 6.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే గాత్ర సంగీతం జరుగనుంది. మే 5వ తేది ఉదయం 9 గంటలకు తిరుపతి ఎం.ఆర్.పల్లి సర్కిల్ వద్ద ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులచే సంగీత సభ, ఉదయం 11.30 గంటలకు హరికథ పారాయణం జరుగనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎస్వీ సంగీత నృత కళాశాల ఆధ్యాపకులచే నృత్య కార్యక్రమం జరుగనుంది.

మే 4వ తేది తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో పుష్పాంజలి, గోష్టి గానం , హరికథ నిర్వహిస్తారు. మే 5వ తేది ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణం, సాయంత్రం సంగీత సభ, హరికథ జరుగనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.