SRI VINAYAKA PUJA HELD _ మొదటి కనుమ రోడ్డులోని శ్రీ వినాయక ఆలయంలో చవితి పూజ
Tirupati, 10 September 2021: TTD transport wing organised Sri Vinayaka Chavati puja on Friday at Sri Vinayaka temple on the first ghat road to Tirumala.
AT KAPILESWARA SWAMY TEMPLE
At the TTD local temple, Sri Kapileswara Swamy temple Vinayaka Chavati was observed with abhisekam and Archana in Ekantam.
Similarly, grand pujas were organised by the TTD at other Vinayaka Swami temple on the second Tirumala ghat road too.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మొదటి కనుమ రోడ్డులోని శ్రీ వినాయక ఆలయంలో చవితి పూజ
తిరుపతి, 2021 సెప్టెంబరు 10: తిరుమల మొదటి కనుమ రోడ్డులో గల శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం చవితి పూజ జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చలువపందిళ్లు వేసి ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రవాణా విభాగం సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో…
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శుక్రవారం వినాయక చవితి పర్వదినాన్ని నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం శ్రీవినాయకస్వామివారికి ఏకాంతంగా కొలువు చేపడతారు.
అదేవిధంగా, రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.