JAGANMOHANAKARA MESMERISES _ మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి
మోహినీ అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతి, 2024 మే 20: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు.
రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆగమ సలహాదారులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, ఆలయ డెప్యూటీ ఈ శ్రీమతి శాంతి, విజివో శ్రీబాలిరెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనుంజయులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.