EARN SELF RESPECT- WOMEN TOLD _ మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం ఇంటి నుండే మొద‌లుకావాలి : టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

15 TTD WOMEN EMPLOYEES BAG SRI PADMAVATHI AWARDS

 Tirupati, 8 Mar. 21: Earn self-respect which is most important for a woman to become strong, said Smt Vemireddi Prasanthi Reddy.

The social worker, entrepreneur and TTD Trust Board member graced the international Women’s Day celebrations held by TTD welfare Mahati Auditorium in Tirupati on Monday. 

TTD Joint Executive Officer Smt Sada Bhargavi said in pursuance of Indus Culture act of respect to women should begin at every home which thereafter will be followed in the society.

She was participating as chief guest at the international women’s day celebrations organised by TTD at the Mahati auditorium for it’s women employees.

She said women should identify their skills and make use of it to empower themselves.

Earlier speakers Smt Ramaa Raavj, Smt Sai Prasanna Ravishankar and Smt Korada Mrudula also spoke on women empowerment. 

JEO Smt Sada Bhargavi during her speech displayed a four-minute clip on how male chauvinism had hindered women’s development in the world with Droupadi Vastrapaharana Episode from Mahabharata.

She said the Mahabharata battle took place as fallout of disgrace and humiliation to a woman. “The society will suffer if women are not treated properly. Learn our your boys on how to respect women from tender age”, she added.

The chief guest and speakers were felicitated with mementos and shawls. 

15 women employees were presented with Sri Padmavati awards for their excellence in service.

Later, 98 women staffers who would retire during 2021-22 were also presented with shawls and mementos.

TTD special Grade DyEOs Smt Parvathi, Smt Varalakshm, DyEOs.Sri Anandaraju, Smt Kasturi, Smt Snehalata, CMO Dr Narmada, Dr Jamunarani Principal of Music and Dance College were present.

Similarly, several women employees who contested in competition- Essay writing, Gatra music, drawing and quiz, held during the IWD were also handed over prizes.

The highlight of the celebrations were cultural events including fancy dress, dance ballets, and Annamacharya sankeetans presented by the TTD women employees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం ఇంటి నుండే మొద‌లుకావాలి : టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

విశేష సేవ‌లందించిన 15 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

తిరుపతి, 2021 మార్చి 08: భార‌తీయ సంస్కృతిలో మ‌హిళ‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన‌ స్థానం ఉంద‌ని, ఆడ‌వారిని గౌర‌వించ‌డం ఇంటినుండే మొద‌లుకావాల‌ని అప్పుడే స‌మాజం మొత్తం గౌర‌విస్తుంద‌ని టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి పేర్కొన్నారు. టిటిడి ఆధ్వ‌ర్యంలో తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో సోమ‌వారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ప్ర‌త్యేక అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ దేవుళ్లు కూడా మ‌హిళ‌ల‌కు స‌మున్న‌త స్థానం క‌ల్పించార‌ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు హృద‌యంలో, బ్ర‌హ్మ నాభిలో, ఈశ్వ‌రుడు శ‌రీరం స‌గ‌భాగంలో అమ్మ‌వారికి స్థానం ఇచ్చార‌ని వివ‌రించారు. స్త్రీకి అవ‌మానం జ‌రిగితే యుద్ధం మొద‌లైంద‌ని మ‌హాభార‌తం ద్వారా తెలుస్తుంద‌న్నారు. ఆధునిక జీవ‌న ప‌రిస్థితుల్లో మ‌హిళ కుటుంబంలో శ‌క్తిమంత‌మైన పాత్ర పోషించాల్సి ఉంద‌న్నారు. ప్ర‌తి కుటుంబంలో త‌ల్లి త‌మ కుమారుల‌కు మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం నేర్పాల‌ని, అమ్మ చెబితే ఎవ‌రైనా వింటార‌ని అన్నారు. స్త్రీని త‌ల్లిగా భావిస్తే దాడులు జ‌ర‌గ‌వ‌న్నారు. పురుషాహంకారం వ‌ల్ల మ‌హిళ‌లు ఎదుర్కొనే ఇబ్బందుల‌ను 4 నిమిషాల ఆడియో క్లిప్ ద్వారా వినిపించారు. ఈ ఆడియో ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ప్ర‌తి పురు‌షుడి విజ‌యం వెన‌క ఒక మ‌హిళ ఉంటుంద‌ని, అలాగే ప్ర‌తి మ‌హిళ విజ‌యం వెనుక కూడా ఒక మ‌హిళే ఉంటుంద‌న్నారు.

టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆత్మాభిమానం, సానుకూల దృక్ప‌థంతో ముందుకు సాగితే జీవితంలో విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని చెప్పారు. మ‌హిళ‌లు ధైర్యంగా ముందుకెళ్లి తాము అనుకున్న‌ది సాధించాల‌న్నారు. స‌మాజంలో కుటుంబం పాత్ర చాలా గొప్ప‌ద‌ని, కుటుంబంతో క‌లిసి న‌డిస్తే మ‌హిళ గెలిచిన‌ట్టేన‌ని చెప్పారు. ప్ర‌తి పురుషుడి విజ‌యం వెనుక త‌ప్ప‌కుండా ఒక మ‌హిళ ఉంటుంద‌న్నారు.

ప్ర‌ముఖ స్ఫూర్తిదాయ‌క ఉప‌న్యాస‌కురాలు శ్రీ‌మ‌తి ర‌మా రావి మాట్లాడుతూ మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డి స‌మాజంలో గుర్తింపు పొంద‌డ‌మే మ‌హిళా దినోత్స‌వానికి సార్థ‌క‌త అ‌న్నారు. మ‌నిషికి నాభిపైన ఛాతీ మ‌ధ్య‌లో జ్యోతి వెలుగుతుంటుంద‌ని, అందులో భ‌గ‌వంతుడు ఉంటార‌ని చెప్పారు. దీన్ని గుర్తించి మంచి ప‌నులు మాత్ర‌మే చేయాల‌న్నారు. అన్నం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూప‌మ‌ని, బాగా తిని మ‌రింత బాగా ప‌నిచేయాల‌న్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు స‌రైన వేళ‌కు, స‌రైన ఆహారం తీసుకోవ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ప్ర‌తిరోజూ భ‌గ‌వ‌త్ ప్రార్థ‌న‌, ప్రాణాయామం, వ్యాయామంతో మ‌హిళ‌లు చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతార‌ని వివ‌రించారు.

ప్ర‌ముఖ ఆధ్యాత్మి‌క ఉప‌న్యాస‌కురాలు శ్రీ‌మ‌తి సాయిప్ర‌స‌న్న ర‌విశంక‌ర్ మాట్లాడుతూ స‌నాత‌న సాంస్కృతిక వైభ‌వాన్ని పునఃప్ర‌తిష్టించేందుకు టిటిడి చేస్తున్న కృషి అమోఘ‌మ‌న్నారు. స్త్రీ, పురుషుల్లో ఒకరు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ కాద‌ని, ఇద్ద‌రూ స‌మాన‌మేన‌ని చెప్పారు. దేశ ఆర్థిక పురోగ‌తికి మ‌హిళ‌ల తోడ్పాటు మెండుగా ఉంద‌న్నారు. 17 అంశాల్లో మ‌హిళ‌లు పురుషుల కంటే మెరుగ్గా ప‌నిచేయ‌గ‌ల‌ర‌ని ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలిసింద‌ని చెప్పారు. హ‌రినామ‌స్మ‌ర‌ణ‌తో అంద‌రూ స‌న్మార్గంలో న‌డ‌వాల‌ని, త‌ద్వారా మ‌న కుటుంబాన్ని, స‌మాజాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని సూచించారు.

అంత‌ర్జాతీయ అథ్లెట్ శ్రీ‌మ‌తి కోరాడ మృదుల మాట్లాడుతూ మ‌న‌ల్ని మ‌నం ప్రోత్స‌హించుకుంటూ ముందుకు సాగితే విజ‌యం త‌ప్ప‌క వ‌రిస్తుంద‌ని, త‌ద్వారా ఇత‌రుల‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వాల‌ని కోరారు. క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ తాను అంత‌ర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన తీరును ఆమె వివ‌రించారు. చిత్త‌శుద్ధితో ప్ర‌య‌త్నిస్తే భ‌గ‌వంతుడితోపాటు ప్ర‌కృతి కూడా స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. క్రీడ‌లు నేర్పిస్తే చ‌దువు పాడ‌వుతుంద‌నేది అపోహ మాత్ర‌మేన‌ని, త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లను వారికి న‌చ్చిన రంగంలో ప్రోత్స‌హించాల‌ని సూచించారు. తాను ఆదాయ ప‌న్ను శాఖ అధికారిగా, భార్య‌గా, త‌ల్లిగా స‌మ‌ర్థ‌వంత‌మైన పాత్ర‌ను పోషిస్తున్నాన‌ని చెప్పారు.

ఈ సందర్భంగా అతిథులను జ్ఞాపిక, శాలువతో సన్మానించారు. అదేవిధంగా, టిటిడిలో విశేష సేవ‌లందించి ఉద్యోగ విర‌మ‌ణ పొందిన ఐదుగురిని స‌న్మానించారు. వీరిలో డాక్ట‌ర్ ఝాన్సీరాణి, శ్రీ‌మ‌తి కృష్ణ‌వేణి, శ్రీ‌మ‌తి స‌రోజ‌మ్మ‌, శ్రీ‌మ‌తి టి.పార్వ‌త‌మ్మ‌, శ్రీ‌మ‌తి శైల‌జ ఉన్నారు.

15 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు శ్రీ ప‌ద్మావ‌తి అవార్డులు

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన 15 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి పేరిట అవార్డులు ప్ర‌దానం చేశారు. వీరికి 5 గ్రాముల వెండి డాల‌ర్‌తోపాటు శాలువ‌, జ్ఞాపిక అందించారు. వీరిలో ఏఈవో(స‌ర్వీసెస్‌) శ్రీ‌మ‌తి సి.కుమారిదేవి, ఎస్వీ ఆర్ట్స్ క‌ళాశాల కామ‌ర్స్ హెచ్ఓడి డా.ఎస్‌.ఉష‌, ఎస్‌పిడ‌బ్ల్యు పాలిటెక్నిక్ అసోసియేట్ లెక్చ‌ర‌ర్ శ్రీ‌మ‌తి బిఎ.ర‌మాదేవి, ఎస్వీ క్యాంటీన్‌(శ్రీ‌నివాసం) సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి జి.క‌ల్యాణి, విద్యా విభాగం సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి ఎం.సునంద‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీ‌మ‌తి కె.విశాల‌క్ష్మి, ఫార్మ‌సిస్ట్ శ్రీ‌మ‌తి ఎం.శోభారాణి, ప్రెస్ కీబోర్డు ఆప‌రేట‌ర్ శ్రీ‌మ‌తి వి.గోదాల‌క్ష్మి, ట్రాన్స్‌పోర్టు ఫిట్ట‌ర్ శ్రీ‌మ‌తి సి.లోకేశ్వ‌రి, ఎస్వీ బాల‌మందిర్ మాట్ర‌న్ శ్రీ‌మ‌తి వి.ల‌క్ష్మీదేవి, రిసెప్ష‌న్‌-1 ద‌ఫేదార్ శ్రీ‌మ‌తి ఎస్‌.అంజ‌లి, సేల్స్ వింగ్ ఆఫీస్ స‌బార్డినేట్ శ్రీ‌మ‌తి ఎం.జ్యోతి, తిరుప‌తి పిహెచ్ యూనిట్ ఎంపిడ‌బ్ల్యు శ్రీ‌మ‌తి ఆర్‌.ఎలిస‌మ్మ, ఎంపిడ‌బ్ల్యు శ్రీ‌మ‌తి కె.వసంత‌, గార్డెన‌ర్ శ్రీ‌మ‌తి డి.గంగుల‌మ్మ ఉన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి పార్వ‌తి, డెప్యూటీ ఈవోలు శ్రీ ఆనంద‌రాజు, శ్రీ‌మ‌తి క‌స్తూరి, శ్రీ‌మ‌తి స్నేహ‌ల‌త‌, సిఎంవో డాక్ట‌ర్ న‌ర్మ‌ద‌, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పిజి క‌ళాశాల ప్రిన్సిపాల్ డా. మ‌హ‌దేవ‌మ్మ ఇతర మహిళా ఆధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మ‌హిళా దినోత్స‌వ పోటీల విజేతల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం

టిటిడి ఆధ్వ‌ర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సోమ‌వారం తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లు పోటీల్లో విజ‌యం సాధించిన మ‌హిళా ఉద్యోగుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

గాత్ర సంగీత పోటీల్లో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, ఎఎవో శ్రీ‌మ‌తి పి.గాయ‌త్రి దేవి ద్వితీయ‌, అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కెఎన్‌.అనూరాధ‌ తృతీయ బ‌హుమ‌తులు సాధించారు.

వ్యాస‌ర‌చ‌న పోటీల్లో సీనియ‌ర్ అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కె.వ‌సంత‌ ప్ర‌థ‌మ‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌ శ్రీ‌మ‌తి కె.శివ‌శంక‌ర‌మ్మ ద్వితీయ‌, స్టాఫ్ న‌ర్సు శ్రీ‌మ‌తి స్వ‌ప్న‌మంజ‌రి తృతీయ బ‌హుమ‌తులు కైవ‌సం చేసుకున్నారు.

చిత్ర‌లేఖ‌నం పోటీల్లో ఎపిఆర్వో కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, సీనియ‌ర్ అసిస్టెంట్‌ శ్రీ‌మ‌తి కె.మాధ‌వి ద్వితీయ‌, న‌ర్సు శ్రీ‌మ‌తి భానుప్రియ తృతీయ బ‌హుమ‌తులు సాధించారు.

క్విజ్ పోటీల్లో శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ క‌ళాశాల తెలుగు విభాగాధిప‌తి డా. వి.కృష్ణ‌వేణి జ‌ట్టుకు ప్ర‌థ‌మ‌, ఫార్మ‌సిస్టు శ్రీ‌మ‌తి ఎం.శోభారాణి జ‌ట్టుకు ద్వితీయ‌, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి ఎం.శ్రీ‌వాణి జ‌ట్టుకు తృతీయ బ‌హుమతులు ల‌భించాయి.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ సంగీత‌, నృత్య క‌ళాశాల విద్యార్థులు నిర్వ‌హించిన సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇందులో అన్న‌మాచార్య కీర్త‌న‌లు, అష్ట‌ల‌క్ష్మీ నృత్య‌రూప‌కం ఉన్నాయి. అదేవిధంగా టిటిడి మ‌హిళా ఉద్యోగుల పౌరాణిక పాత్ర‌ల వేష‌ధార‌ణ పోటీలు నిర్వ‌హించి విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా|| వి.కృష్ణవేణి, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి ఇందిర‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.