రు.18 కోట్లకు లెక్కలున్నాయి

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ, తిరుపతి, జూన్‌ 04, 2011

రు.18 కోట్లకు లెక్కలున్నాయి

జూన్‌ 04వ తేదిన ”ఈనాడు” దినపత్రిక నందు ప్రచురించిన ”రు.18 కోట్లకు లెక్కల్లేవ్‌ ” అని ప్రచురించిన వార్త నిజం కాదు.
 
2006-07 సం.లో, 2007-08 సం.లో కల్యాణోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు, ఇతర కార్యక్రమాల నిమిత్తం డ్రా చేసిన సొమ్ములో కొంత భాగానికి ఆ సంవత్సరంలోనే లెక్కలు పూర్తిగా తేలాయి. మిగిలిన భాగానికి ఆ తర్వాతి సంవత్సరంలో పూర్తిగా ఆధారాలతో పాటు లెక్కలున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికి సంబంధించిన ఓచర్లు ఉన్నాయి. ఆధారాలున్నాయి. వీటిని తదుపరి సంవత్సరాలలో సమర్పించడం వల్ల 2006-07, 2007-08 అడిట్‌ రిపోర్టులో అడ్వాన్సుగా ఆడిట్‌వారు చూపడం జరిగింది. వీటి అడ్జెస్టుమెంటు తదుపరి సంవత్సరాలలో జరగడం వల్ల ఈ విషయం తెలియక పత్రికలో లెక్కల్లేవు అనే వార్త ప్రచురించారు. అయితే అన్నింటికీ లెక్కలున్నాయని తెలియజేస్తున్నాం.
 
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.