KARTIKA VANA BHOJANAM VENUE CHANGED _ రేపు తిరుమలలో కార్తీక వన భోజనం
Tirumala, 16 November 2024: TTD will organize the Karthika Vana Bhojanam program in Tirumala on Sunday at the Vaibhavotsava Mandapam near the Srivari Temple instead of Paruveta Mandapam in the wake of the heavy rain alerts warned by the Meteorological department.
It is customary to organize Vana Bhojanam every year during the holy month of Karthika.
As part of this, the utsava deities will reach the Vaibhavotsava Mandapam in the morning. Between 11 am and 12 noon, Snapana Tirumanjanam will be performed.
Due to this festival, the TTD has cancelled the Kalyanotsavam, Unjal Seva, Arjitha Brahmotsavam and Sahasra Deepalankara Seva.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
రేపు తిరుమలలో కార్తీక వన భోజనం
భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో వేదిక మార్పు
తిరుమల, 2024 నవంబరు 16: తిరుమలలో కార్తీక వన భోజన కార్యక్రమాన్ని రేపు (17.11.24)శ్రీవారి ఆలయం సమీపంలోని వైభవోత్సవ మండపంలో టీటీడీ నిర్వహించనుంది. సాధారణంగా పార్వేట మండపంలో ఈ కార్యక్రమం జరగడం ఆనవాయితీ. వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వైభవోత్సవ మండపంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వైభవోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి వేంచేపు చేస్తారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.