లతామంగేష్కర్‌ గాత్రంలో అన్నమయ్య కీర్తనలు

లతామంగేష్కర్‌ గాత్రంలో అన్నమయ్య కీర్తనలు

తిరుమల, 2010 జనవరి 29: ప్రపంచ ప్రఖ్యాతగాయిని ”భారతరత్న” డాక్టర్‌ లతామంగేష్కర్‌ తొలిసారిగా ప్రధమ తెలుగు వాగ్గేయకారుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుని సంస్కత కీర్తనలను స్వయంగా స్వరపరచి ఆలపించిన సి.డి.లు తితిదే 2010 జనవరి 30న తిరుమల నాదనీరాజనం మండపంలో విడుదలచేస్తుంది.

ఈ సి.డి.లలో డా||లతామంగేష్కర్‌ అన్నమయ్య రచించిన ఏడు సంస్కృత కీర్తనలు ఆలపించారు. అవి

1. మాజహిహి 2. తవమాంద్రష్టుం  3. ఏవందర్శయసి 4. థవిధాచరణం
5. త్వమేవశరణం 6. యాదృశానాం… 7. పృధులహేమకాపీనధర……  వీటితో పాటు లతామంగేష్కర్‌ ఆలపించిన కోలాటం, భజనలు కూడా సి.డి.లో ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గౌ|| ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ గారు ముఖ్యఅతిథిగా, రాష్ట్రముఖ్యమంత్రి డా||కె.రోశయ్య గారు ప్రధానఅతిథిగా,మధ్యప్రదేశ్‌గవర్నర్‌ రామేశ్వర ఠాగుర్‌ గారు, రాష్ట్రదేవదాయధర్మదాయశాఖామాత్యులు శ్రీగాదె వేెంకటరెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె.ఆదికేశవులు, అధికారులు ఈ సి.డి. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సి.డి.మార్కెటింగ్‌పై సర్వహక్కులను డా||లతామంగేష్కర్‌ తి.తి.దేకు వ్రాసిస్తున్నారు. అంతేకాక ఈ సి.డి.లలో పాడినందుకు, సంగీతం స్వరపరచినందుకుకఆమె ఏవిధమైన పారితోషికం తీసుకోలేదు. ఈ సి.డి.ల తయారీల సమన్వయకర్త ఆంధ్రప్రదేశ్‌ కళావేదిక అధ్యకక్షులు శ్రీ ఆర్‌.వి.రమణమూర్తి స్వచ్ఛందంగా సహకరించారు.
 
”భారతరత్న” లతామంగేష్కర్‌ ఆలపించిన ఈ అన్నమయ్య సంస్కత  కీర్తనలు వీనులవిందు చేయడమేకాక విశ్వవిఖ్యాతి నార్జిస్తాయనడంలో సందేహంలేదని, సంగీతప్రియుల అభిప్రాయం. డా|| లతామంగేష్కర్‌ ఈ గీతాలు ఆలపించడంవల్ల అన్నమయ్య కవిత్వ సంకీర్తనాశక్తి ఉత్తరభారతదేశంలో కూడా విస్తృతంగా ప్రచారంకావడానికి దోహదపడుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.