CHATURVEDA HAVANAM FROM JUNE 29 TO JULY 5 _ లోక శ్రేయస్సు కోసం జూన్ 29 నుండి జులై 5దాకా చతుర్వేద హవనం – జేఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 12 JUNE 2023: The unique Chaturveda Havanam is mulled by TTD seeking the divine intervention for the welfare of the people between June 29 to July 5, said TTD JEO for Health and Education Smt Sada Bhargavi.

In a review meeting held at Sri Padmavathi Rest House in Tirupati with officials concerned on Monday evening, the JEO said nearly 30-35 Ritwiks will be performing this maiden Havanam in Tirupati which will be taking place in thd Parade Grounds of TTD Administrative Building.

She directed the Engineering officials to complete the arrangements as per the requirement and also the floral and other decorations to match the occasion accordingly.

She also reviewed Sahasra Purusha Veda Swasti to be performed in Tirupati.

The VC of SVVU Sri Rani Sadasiva Murty, Vedic Scholar Sri Rama Sharma, CEO SVBC Sri Shanmukh Kumar, CAuO Sri Sesha Sailendra, SVIHVS special officer Dr Vibhishana Sharma, All Projects Program Officer Sri Rajagopal Rao and other HoDs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

లోక శ్రేయస్సు కోసం జూన్ 29 నుండి జులై 5దాకా చతుర్వేద హవనం – జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 12 జూన్ 2023: లోక శ్రేయస్సు కోరుతూ తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలోని మైదానంలో జూన్ 29 వతేదీ నుండి జూలై 5వ తేదీ వరకు శ్రీశ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు జేఈవో శ్రీమతి సదా భార్గవి తెలిపారు. తిరుపతి లో తొలిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయం తో పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో సోమవారం సాయంత్రం చతుర్వేద హవనం ఏర్పాట్లపై ఆమె సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, దాదాపు 30 నుండి 35 మంది రుత్వికులు చత్రుర్వేద హవనం నిర్వహణలో పాల్గొంటారని చెప్పారు. వీరందరికీ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం లో వసతి, భోజన సదుపాయాలు కల్పించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అక్కడి నుండి వేదిక వద్దకు వీరిని తీసుకుని రావడానికి అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. హోమ నిర్వహణకు అవసరమయ్యే ద్రవ్యాలు ముందే సిద్ధం చేసుకోవాలన్నారు. వేదిక నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. గార్డెన్ విభాగం పుష్పాలంకరణలు, విద్యుత్ విభాగం విద్యుత్ అలంకరణలు ఆకట్టుకునేలా ఉండాలని ఆదేశించారు. సాయంత్రం వేళల్లో భక్తులకోసం వేద ప్రవచనాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ విభాగం అధికారులు హోమ నిర్వహణకు అవసరమయ్యే పుల్లల ను సిద్ధం చేయాలని చెప్పారు. ఎస్వీ బీసి లో ఈ కార్యక్రమం ప్రసారం చేయాలని, ముందుగానే ప్రోమోలు, స్క్రోలింగ్ లు ప్రసారం చేయాలని జేఈవో చెప్పారు.

టీటీడీ తిరుపతి లో నిర్వహించనున్న సహస్ర పురుష వేద స్వస్తి ( చతుర్వేద సభ) కార్యక్రమం నిర్వహణ గురించి కూడా జేఈవో చర్చించారు.

వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదా శివమూర్తి, రాజమండ్రికి చెందిన వేద భాష్య ప్రముఖులు శ్రీ చిర్రావూరు శ్రీ రామశర్మ, ఎస్వీ బిసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణ శర్మ, హిందూ ధార్మిక ప్రాజెకుల ప్రోగ్రామ్స్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల రావు తో పాటు వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది