వాయిదా పడిన ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అడ్మిషన్లు 

వాయిదా పడిన ఎస్వీ సంగీత, నృత్య కళాశాల అడ్మిషన్లు

తిరుపతి, జూన్‌ 22, 2011: తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో 2011-12 విద్యా సంవత్సరమునకు గాను కళాశాలలో నేర్పించబడే అన్ని కోర్సులలో అడ్మిషన్ల కొరకు ప్రకటించిన తేది జూలై 4 నుండి జూలై 18కి వాయిదా వేసినట్లు తెలుపడమైనది.
 
కళాశాలలో నిర్వహించే అడ్మిషన్ల ఇంటర్వ్యూలు జూలై మాసం 18 నుండి 23 వరకు జరుగుతాయి. మొదటి సంవత్సరము తరగతులు జూలై 25 నుండి ప్రారంభం కానున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికెట్టు, డిప్లమా పలితాలు వచ్చిన తరువాత మాత్రమే సాయంత్రం కళాశాల మరియు నాదస్వర పాఠశాల, డిప్లమా కోర్సుల అడ్మిషన్లు నిర్వహింపబడతాయి.

మరిన్ని వివరాల కొరకు ఎస్వీ సంగీత,నృత్య కళాశాల ఫోన్‌ నెం.0877-2264597 ను సంప్రదించగలరు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.