వాహన స్కానర్‌ను పరిశీలించిన తితిదే చైర్మన్‌

వాహన స్కానర్‌ను పరిశీలించిన తితిదే చైర్మన్‌

తిరుపతి, ఏప్రిల్‌  26, 2013: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికుల వాహనాలను తనిఖీ చేసేందుకు ఉద్దేశించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల వాహన స్కానర్‌ను తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు శుక్రవారం రాత్రి పరిశీలించారు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఈ స్కానర్‌తో చేసే వాహనాల స్కానింగ్‌ ప్రక్రియను స్వయంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల భద్రతపరంగా ఈ యంత్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయమై అధికారులతో లోతుగా చర్చించి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.