STUDENTS FOLLOW THE RIGHTEOUS PATH SHOWN BY SRI VETURI PRABHAKAR SHASTRY – SVETA DIRECTOR _ విద్యార్థులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మార్గాన్ని అనుస‌రించాలి  – శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి

Tirupati, 07 February 2024:  SVETA Director Sri Bhumana Subrahmanya Reddy on Wednesday exhorted that the students of SV Oriental College to follow the path shown by poet, writer and epigraphist Sri Veturi Prabhakar Shastry.

Participating in the 136th Jayanti of Sri Shastry at SV oriental college he garlanded and paid rich floral tributes to bronze statue in the college premises.

Speaking on the occasion he lauded the efforts of Sri Shastry in compiling Annamacharya Sankeertans and spreading the glory of Sri Venkateswara Swamy across the world.

He also garlanded the lifesize bronze statue of Sri Shastry in front of SVETA Bhavan where in senior TTD officials participated besides students and faculty.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

విద్యార్థులు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి మార్గాన్ని అనుస‌రించాలి  – శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి

తిరుపతి, 2024 ఫిబ్ర‌వ‌రి 07: క‌విగా, ర‌చ‌యిత‌గా, తాళ‌ప‌త్ర ప‌రిశోధ‌కుడిగా తెలుగు సాహితీరంగంలో త‌న‌దైన ముద్ర వేసిన శ్రీ వేటూరి ప్ర‌భాక‌ర‌శాస్త్రి చూపిన‌ మార్గాన్ని ఎస్వీ ఓరియంట‌ల్ క‌ళాశాల విద్యార్థులు త‌ప్ప‌క అనుస‌రించాల‌ని, భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించాల‌ని శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ‌ జయంతి సంద‌ర్భంగా శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో గల శ్రీ ప్రభాకరశాస్త్రి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు.

ఈ సంద‌ర్భంగా శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి మాట్లాడుతూ, తిరుమ‌ల శ్రీ‌వారిపై అన్న‌మ‌య్య ర‌చించిన సంకీర్త‌న‌ల‌ను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి శ్రీ ప్రభాకరశాస్త్రి కృషి చేశార‌ని చెప్పారు. ఉన్నతమైన సాహితీ విలువలను, తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన ఘనత వేటూరి వారికే దక్కుతుందన్నారు.

శ్రీ వేటూరి విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి

ఈ సంద‌ర్భంగా ఉద‌యం తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ ప్రభాకరశాస్త్రి విగ్రహానికి శ్వేత డైరెక్ట‌ర్ శ్రీ భూమ‌న సుబ్ర‌మ‌ణ్యం రెడ్డి, స్విమ్స్ డైరెక్డ‌ర్ డాక్ట‌ర్ ఆర్‌వి.కుమార్‌, సిపిఆర్వో డా.టి.ర‌వి, సిఏవో శ్రీ శేష శైలేంద్ర‌, డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టుల సంచాల‌కులు డాక్టర్ విభీషణ శర్మ, త‌దిత‌రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో క‌ళాశాల అధ్యాప‌కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.