QUALITY EDUCATION TO STUDENTS- JEO BHARGAVI _ విలువలతో కూడిన విద్యను అందించాలి – జెఈవో ( విద్య,ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి

Tirupati, 20 Dec. 21: TTD joint Executive Officer (education &health) Smt Sada Bhargavi directed officials to ensure imparting quality education to students of all TTD educational institutions.

 

 

During a review meeting of principals and wardens of all institutions, the TTD JEO urged all teachers, lecturers, hostel wardens etc. to pay special attention and review on student’s health and also the food facility in consultation with wardens.

 

 

She said the principals should also focus on the health of students besides the quality of education.

 

 

Thereafter the JEO also visited the SV oriental college girls hostel and monitored cleanliness in the toilets, bathrooms.

 

 

Devasthanams Educational Officer Sri Govinda Rajan and other officials were present.

 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

విలువలతో కూడిన విద్యను అందించాలి – జెఈవో ( విద్య,ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2021 డిసెంబర్ 20: టీటీడీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని జెఈవో ( విద్య,ఆరోగ్యం) శ్రీమతి సదా భార్గవి ఆదేశించారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని కార్యాలయంలో టిటిడి కళాశాలల ప్రిన్సిపాల్ లు మరియు వార్డెన్ లతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి కళాశాల లో ఉపాధ్యాయులు అధ్యాపకులు హాస్టల్ వార్డెన్లు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యంపై వార్డెన్ లను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా కళాశాలలోని విద్యార్థుల ఆరోగ్యంతోపాటు విలువలు పెంపొందించే విధంగా ప్రిన్సిపాల్ లు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు టీటీడీ అందిస్తున్న విద్య,
వసతి, భోజన సౌకర్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు.

అనంతరం జెఈవో ఎస్వీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధునుల హాస్టల్ పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

హాస్టళ్లలోని వంట గదులు, విద్యార్థుల వసతి గదులు, తరగతి గదులను ఆమె పరిశీలించారు. మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో పరిశుభ్రతను పరిశీలించారు.

దేవస్థానం విద్యా శాఖాధికారి శ్రీ గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది